Thursday, June 2, 2016

కైలాస మానస సరోవరము-2

ముక్తిమార్గం.. కైలాస యాత్ర సాధ్యమేనా..?
సర్వజగత్తునూ నడిపించే లయకారుడు పరమ శివుడు. భక్తసులభుడిగా పేరు తెచ్చుకున్న ఆ భోళా శంకరుడి ఉండేది కైలాసంలో. హిమాలయాల్లోనే ఈ కైలాసం ఉందన్నది భక్తుల విశ్వాసం. ఆ పర్వతాన్ని దర్శించుకుంటే వచ్చే అనుభూతి మాటల్లో వర్ణించలేదని.. పదాలకు అంతుచిక్కనిది. ఒక్కసారి కైలాసగిరిని దర్శించుకుంటే.. సర్వపాపవిమోచనం కలుగుతుంది. అంత పవిత్రమైన స్థలం.. కైలాసపర్వతం. ఆ కైలాసం విశ్వాంతరాల్లోనో, పాతాళలోకంలోనే లేదు.. భూమిపైనే ఉంది. శివపార్వతులు అక్కడే కొలువై ఉన్నారు. ప్రమథగణాలతో ఈ లోకాన్ని పాలిస్తున్నారు. పరమపవిత్రమైన హిమాలయాల్లో.. దేవాదిదేవతలు కొలువైన మంచుకొండల మధ్యలో... ఈ భూలోక కైలాసం ఉంది. అదే.. హిమాలయ పర్వతాల్లోని కైలాస శిఖరం. కేవలం మహాశివుడు మాత్రమే కాదు.. అక్కడికి వెళితే మహాలక్ష్మితో సేవలందుకుంటూ పాలసముద్రంలో పవళించిన విష్ణుమూర్తి దర్శనమూ లభిస్తుంది. బ్రహ్మమనస్సు నుంచి ఉద్భవించిన పరమపవిత్రమైన సరోవరమూ ఇక్కడ ఉంది. దేవతలు స్నానమాచరించే, ఈ పవిత్ర జలాల్లో ఒక్క మునకేసినా... పాపలన్నీ నశించి.. ఎంతో పుణ్యాన్ని దక్కించుకున్నవారవుతారు. కైలాస పర్వతంపైనే మహాశివుడి నివాసం ఉందని పురాణాలు చెబుతున్నాయి. తరతరాలుగా భక్తుల నమ్మకం కూడా అదే. అందుకే, భోళాశంకరుడి దర్శనం కోసం ఎన్నో కష్టాలకు ఓర్చి మానససరోవర యాత్రను చేస్తుంటారు. ఈ యాత్ర చేయాలంటే, డబ్బు మాత్రమే ఉంటే సరిపోదు. అంతకు ముంచి ఆధ్యాత్మిక బలం, సంకల్పం ఉండాల్సిందే. ఇంకా చెప్పాలంటే మహాశివుడి కటాక్షం లేనివారికి ఈ యాత్ర చేయడం దుర్లభమే. శివ భగవానుడే కాదు, ఆయన వాహనమైన నందీశ్వరుడు, విఘ్నాలకు అధిపతి గణపతి, దేవతల సేనాధిపతి కుమారస్వామి కైలాస పర్వతంపై దర్శనమిస్తారు. సూర్యభగవనాడు భక్తితో అర్పించే కిరణాలు... కైలాస శిఖరాన్ని తాకగానే... వెండికొండ కాస్తా బంగారు మయమై.. శోభిస్తుంది. ఆ దర్శనం జన్మజన్మల సుకృతం. సముద్ర మట్టానికి 22 వేల 778 అడుగుల ఎత్తులో ఉందీ భూలోక కైలాసం. ఇక్కడికి వెళ్లిన ప్రతీఒక్కరినీ శివరూపదర్శనం లభిస్తుందన్నది భక్తుల విశ్వాసం. అడుగడుగునా ఆధ్యాత్మికత పరుచుకున్న ఈ అందమైన శిఖరాన్ని దర్శించుకుంటే దొరికే అనుభూతి.. దేన్ని చూసినా రాదంటారు శివభక్తులు. మౌంట్ కైలాస్‌ భూలోకంలో ఉన్న ఓ అద్భుతమనే చెప్పాలి. ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో రహస్యాలు ఈ పర్వతం చుట్టూ దాగిఉన్నాయి. నాలుగువైపులా నాలుగు రంగుల్లో కనిపించడం కైలాస పర్వతానికి ఉన్న మరో ప్రత్యేకత . అందుకే.. హిమాలయాల్లోనే అత్యంత అరుదైన పర్వతంగా పేరుగాంచింది.. మహాశివుడికి నివాసం అయ్యింది కైలాసగిరి. ఎన్నో వ్రతాల ఫలాన్నిచ్చే మానససరోవరం.. పాపప్రక్షాళన చేసే కైలాస పర్వతాన్ని దర్శించుకునే మహద్భాగ్యాన్ని కల్పిస్తుంది మానససరోవర యాత్ర. కైలాసయాత్ర కైలాస్ మానసరోవర్ యాత్రను రెండు రకాలుగా చేయవచ్చు. మొదటిది కేంద్ర ప్రభుత్వం ద్వారా అయితే.. ప్రైవేటు టూర్ ఆపరేటర్ల ద్వారా వెళ్లడం రెండో పద్దతి. ।ప్రతీ ఏడాది జూన్‌ 9 నుంచి సెప్టెంబర్ 9 మధ్య కొద్ది మందిని మాత్రమే ప్రభుత్వం ఈ యాత్రకు అనుమతిస్తుంది. ఈ ఏడాది వెయ్యా 80 మందికి మాత్రమే అవకాశం దక్కనుంది. వీరిని 60 మంది చొప్పున 18 బృందాలుగా విభజించి యాత్రకు పంపిస్తుంది. దీనికోసం ఇప్పటికే షెడ్యూల్‌ విడుదలయ్యింది. ఆన్‌లైన్‌లో అయితే, మార్చి నాలుగో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ నింపడం పూర్తైన తర్వాత ప్రింటవుట్ తీసుకుని మార్చి 11 వ తేదీ లోగా విదేశీ మంత్రిత్వ శాఖకు సమర్పించాలి. నేరుగా దరఖాస్తు చేసుకునేవారికి కూడా మార్చి పదకొండే ఆఖరు తేది. రానుపోను 27 రోజుల పాటు సాగే మానసరోవరయాత్రకు ఎన్నో రకాలుగా సిద్దం కావాల్సి ఉంటుంది. చైనా వీసాతో పాటు, ఆరోగ్యపరీక్షలు చేసుకోవడానికి రెండు మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండాల్సి ఉంటుంది. సముద్రమట్టానికి దాదాపు 20వేల అడుగుల ఎత్తున పర్వతాలపై నడవాల్సి ఉంటుంది కాబట్టి, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవాళ్లకే అనుమతి లభిస్తుంది. గుండెజబ్బులు, రక్తపోటు, శ్వాససంబంధ సమస్యలతో బాధపడేవారు ఈ యాత్ర చేయడానికి అనర్హులు. వైద్యపరీక్షల్లో అర్హత సాధించినవారికి ఢిల్లీ నుంచి యాత్ర మొదలవుతుంది. పగలు ప్రయాణం రాత్రి పూట విశ్రాంతి పద్దతిలో ఈ యాత్ర సాగుతుంది. మూడోరోజు దార్‌చులాకు చేరుకుంటారు. 25 కిలోలకు మించి లగేజ్‌ను మోసుకు వెళ్లడానికి ఇక్కడినుంచి అనుమతి ఉండదు. గుర్రాలను, పోర్టర్లను అద్దెకు కావాలంటే.. ఇక్కడే డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. నాలుగోరోజు ప్రయాణం మొదలై.. నారాయణస్వామి ఆశ్రమానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి ట్రెక్కింగ్ మొదలవుతుంది. ఆ తర్వాత మూడు రోజుల పాటు టెక్కింగ్ చేసిన యాత్రికులు గుంజి అనే గ్రామానికి చేరతారు. పచ్చని ప్రకృతి అందాలు, కాళీ నది పరవళ్లు.. పర్వతాలను ముద్దాడుతున్నట్లు కనిపించే మేఘాల మధ్య ఎంతో ఆహ్లాదభరితంగా సాగుతుందీ యాత్ర. ట్రెక్కింగ్ చేయడం వల్ల వచ్చే అలసటను ఈ ప్రకృతి అందాలు మాయం చేస్తుంటాయి . మధ్యలో ఎదురయ్యే గ్రామాల్లో స్థానికులు యాత్రికులకు ఘనంగా స్వాగతం పలుకుతుంటారు. ఏడో రోజుకు యాత్ర గుంజి గ్రామానికి చేరుతుంది. మంచుతో కప్పబడిన పర్వతాలు ఇక్కడ సమనోహరంగా కనిపిస్తాయి. సూర్యకిరణాలు పడగానే బంగారు రంగులో ప్రకాశిస్తూ.. అచ్చెరువొందిస్తాయి. రెండు రాత్రుళ్లు గుంజిలోనే గడపాల్సి ఉంటుంది. ఎనిమిదో రోజు ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్ అధికారులు యాత్రికులకు మళ్లీ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఫిట్‌గా ఉన్నారని తేలినవారికే.. ముందడుగు వేయడానికి అనుమతి లభిస్తుంది. అనారోగ్యంతో ఉన్నవారిని వెనక్కి పంపించేస్తారు. తొమ్మిదో రోజు గంజి నుంచి ప్రయాణం నవీడాగ్‌ అనే ప్రాంతానికి సాగుతుంది. మధ్యలో వ్యాసమహర్షి గుహ కనిపిస్తుంది. ఇక్కడే ఆయన మహాభారతాన్ని రచించారట. నవీడాగ్ చేరుకున్నాక.. ఓం పర్వత దర్శనం లభిస్తుంది. అయితే.. ఎప్పుడూ మేఘాలు ముసురుకుని ఉండే ఈ పర్వతంపై ఓం ఆకారాన్ని చూడాలంటే, ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. పర్వతాల మధ్య ఓం రూపంలో కనిపించే ఆకారం.. ప్రతీఒక్కరిలో ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తుంది. నవీడాగ్ నుంచి టిబెట్ సరిహద్దు ప్రాంతమైన లిపులేక్ వరకూ మరుసటి రోజు ట్రెక్కింగ్ సాగుతుంది. మంచుపై నడుస్తూ యాత్రికులు ఎంతో జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. టిబెట్ సరిహద్దు దాటిన తర్వాత, తటలా కోట్‌కు బస్సులో ప్రయాణం సాగుతుంది. ఆ తర్వాతి రోజు, అక్కడి వాతావరణానికి అలవాటు పడడానికి తటలా కోట్‌లోనే బస చేయాల్సి ఉంటుంది. పన్నెండో రోజు.. కైలాస పర్వతం బేస్ క్యాంప్ అయిన డార్చెన్‌ కు యాత్ర మొదలవుతుంది. మధ్యలో రాక్షసతాల్ అనే సరస్సు ఎదురుపడుతుంది. మానసరోవరానికన్నా ముందు కనిపించే సరస్సిది. శివ కటాక్షం కోసం రావణాసురుడు ఇక్కడే తపస్సు చేశాడని ప్రతీతి. కైలాస పర్వతం యాత్రికులకు తొలిసారి ఇక్కడి నుంచే కనిపిస్తుంది. కొండలమధ్య మహాశివలింగం కొలువైనట్లు కనిపించే.. ఆ దృశ్యం చూడగానే, యాత్రికులు అంతవరకూ పడ్డ అలసట మాయమైపోతుంది. కైలాస శిఖరం దగ్గరకు ఎప్పుడెప్పుడు చేరుకుందామా... అన్న ఆతృత పెరుగుతుంది. కాస్త ముందుకు వెళ్లగానే.. అతిమనోహరమైన మానసరోవరం దర్శనమిస్తుంది. సూర్యకాంతి పడి నక్షత్రాలు నేలకు దిగినట్లు కనిపించే దృశ్యం.. యాత్రికులను మదిని పులకరింపచేస్తుంది. డార్చెన్‌కు చేరుకున్న యాత్రికులు.. పవిత్రమైన మానసరోవరం స్నానమాచరించి.. మరుసటి రోజు కైలాస్ పరిక్రమకు సిద్ధమవుతారు. ఇలా ప్రభుత్వం ద్వారా డార్చెన్ చేరుకోవాలంటే.. పన్నెండు రోజుల పాటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇంత సుదీర్ఘ యాత్ర చేయలేని వారి కోసం ప్రైవేటు సంస్థలు మానసరోవరయాత్రను అందిస్తున్నాయి. నేపాల్ రాజధాని ఖాట్మండు మీదుగా సాగే ఈ యాత్ర ద్వారా అయితే, ఐదు రోజుల్లోనే మానససరోవర్‌కు చేరుకోవచ్చు. అయితే, చిన్నపాటి విమానాల ద్వారా ఈ యాత్రంతా సాగుతుంది. వాతావరణం అనుకూలించకపోతే, యాత్రకు మధ్యలోనే అడ్డంకులు ఏర్పడవచ్చు. పరిక్రమంతో పుణ్యం కైలాస పర్వతాన్ని, మానసరోవరాన్ని వేరువేరుగా చూడలేం. హిమాలయాల్లో ఉన్న ఈ రెండు ప్రాంతాలు పరమపవిత్రమైనవి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కైలాస పర్వతాన్ని చూస్తే.. అమరేశ్వరుడిని చూసిన అనుభూతే కలుగుతుంది. గడ్డకట్టే చలిలో.. మంచు పర్వతాల మధ్య.. ఎప్పుడూ స్వచ్చమైన నీళ్లతో కనిపించే మానసరోవరం.. అందరికీ మిస్టరీలానే ఉంటుంది. అందుకే, అటు కైలాస పర్వత పరిక్రమను, మానసరోవర పరిక్రమనూ పూర్తి చేసి పుణ్యం కట్టుకుంటారు భక్తులు. కైలాస పర్వత పాదభాగంలో ఉన్న డార్చెన్ నుంచి యాత్రికులు ముందుగా మానసరోవర పరిక్రమను మొదలుపెడతారు. బ్రహ్మమానస సరోవరాన్ని చుట్టూ తిరిగి రావడానికి మూడు రోజుల సమయం పడుతుంది. తొలిరోజు డార్చెన్ నుంచి కుహు కు.. రెండో రోజు కుహూ నుంచి కుగుకూ యాత్ర సాగుతుంది. కుగు నుంచి చూస్తే.. మానసరోవరం, కైలాసపర్వతం కలిసి ఉన్నట్లే కనిపిస్తాయి. ఇదో అద్భుతమైన దృశ్యం. అంతేకాదు.. ఒక్కోసారి కైలాస శికరం నుంచి కాంతిపుజం మానస సరోవరంలోకి ప్రవహిస్తున్నట్లు కూడా కనిపిస్తుంది.. తిరిగి డార్చెన్‌కు చేరుకోవడంతో మానసరోవర పరిక్రమ ముగుస్తుంది. భూమ్మీద మరెక్కడా కనిపించని స్వచ్చమైన నీరు.. కేవలం మానసరోవరంలో మాత్రమే కనిపిస్తుంది. గంటగంటకూ ఒక్కో తరహాలో కనిపించే సరోవరం పర్యాటకులకు అంతులేని అనుభూతిని కలిగిస్తుంది. ఆ తర్వాత రోజు డార్చెన్ నుంచి కైలాస పరిక్రమ మొదలవుతుంది. కైలాసనాథుడి కొలువైన పర్వతాన్ని చుట్టిరావడానికి మూడురోజుల సమయం పడుతుంది. మొత్తం యాత్రలో అత్యంత కష్టమైన ప్రయాణమిది. యమద్వారం మీదుగా తొలిరోజు భక్తులు నడకసాగిస్తారు. ఈ ద్వారాన్ని దాడటం ద్వారా మృత్యుభయం తొలిగిపోతుందని విశ్వసిస్తారు. ఆ తర్వాతే, బ్రహ్మపుత్ర నది దర్శనమిస్తుంది. కైలాసపర్వతంపైనే బ్రహ్మపుత్ర నది జన్మస్థలం ఉంది. దీంతో పాటు గంగ, సింధు, సట్లైజ్ నదులు కూడా ఇక్కడే పుట్టి దక్షిణాసియాను సస్యశ్యామలం చేస్తున్నాయి. అది మహాశివుడు మానవాళికిచ్చిన మహా ప్రసాదం. కష్టమైన దారిలో జాగ్రత్తగా నడుస్తూ.. కైలాసగిరి అందాలను చూస్తూ.. ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగుతారు శివ భక్తులు. మధ్యలో బ్రహ్మపుత్రానదిని దాటాల్సి ఉంటుంది. ఆ తర్వాత డేరాపుక్ క్యాంప్ వస్తుంది. అప్పటికే సాయంత్రం అయిపోతుంది. కైలాస పర్వత శిఖరం.. ఇక్కడికి అత్యంత సమీపం నుంచి కనిపిస్తుంది. వాతావరణం త్వరత్వరగా మారిపోతుంటుంది. కైలాస శిఖరం కూడా దానికి తగ్గట్లే రంగులు మార్చుతూ, యాత్రికులను భక్తపారవశ్యంలో ముంచెత్తుతుంది. డేరాపుక్ నుంచి డోల్మా పర్వతం మీదుగా యాత్ర సాగుతుంది. ఈ దారి దారి చాలా క్లిష్టంగా ఉంటుంది. సముద్రమట్టానికి దాదాపు 20 వేల అడుగుల ఎత్తున ఉండడం కారణంగా ఆక్సిజన్ సరిగా అందదు. శివనామస్మరణ చేస్తూ, భగవంతుడిపైనే భారం వేసి ముందుకు కదులుతారు యాత్రికులు. ఆ శివనామ స్మరణే.. భక్తులకు కావాల్సిన శక్తిని అందిస్తుంది. మధ్యలో గౌరీకుండ్ కనిపిస్తుంది. ఎమరాల్డ్‌ లా కనిపించే ఈ కొలనులోనే పార్వతీదేవి స్నానమాచరిస్తుందట. కొండల నడుమ కనువిందు చేస్తుందీ ప్రాంతం. జోంగ్‌ జెర్బును చేరుకోవడంతో ఆరోజు యాత్ర ముగుస్తుంది. ఆ తర్వాతి రోజు.. అక్కడి నుంచి డార్చెన్‌కు ప్రయాణం సాగడంతో కైలాస పరిక్రమ ముగుస్తుంది. ఈ యాత్రలో నాలుగు వైపులా నాలుగు రకాలుగా కనిపిస్తుంది కైలాస పర్వతం. ఒక వైపు నుంచి చూస్తే స్ఫటికంలా కనిపిస్తుంది. ఇంకో వైపు నుంచి చూస్తే బంగారు వర్ణంలో మెరుస్తుంది. మూడో వైపు రూబీలాగా, నాలుగో వైపు నీలం రాయిగా సాక్షాత్కరిస్తుంది. ఇక నాలుగు వైపులా నాలుగు రూపాలు భక్తులకు దర్శమనిస్తాయి. హయగ్రీవ రూపమైన గుర్రం, పార్వతీ దేవి వాహనమైన సింహం, వినాయకుడికి ప్రతిరూపమైన ఏనుగు, కుమారస్వామి వాహనమైన నెమలి రూపాలు కనిపిస్తాయంటారు భక్తులు. ఇవన్నీ ఈశ్వర స్వరూపానికి ప్రతీకలే పరమపవిత్రమైన కైలాస శిఖర పరిక్రమే భక్తులు పరిమితమవుతారు తప్ప, శిఖరాన్ని అధిరోహించడానికి ఎవరూ ప్రయత్నించారు. పదో శతాబ్ధంలో ఓ బౌద్ధగురువు శిఖరాధిరోణ చేసినట్లు చెప్తారు. ఆ తర్వార ఎవరికీ ఇది సాధ్యం కాలేదు. ఈ విషయంలో చైనా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అత్యంత ఎత్తైన ఎవరెస్టును ఎంతోమంది ఎక్కగలిగారు గానీ, కైలాస పర్వత అంచును మాత్రం ఎవరూ చూడలేకపోయారు. అందుకే, ఇది మహాఅద్భుతంగా మిగిలిపోయింది. కైలాస,మానసరోవర పరిక్రమ యాత్రను పూర్తి చేసుకున్నవాళ్లకు ఎంతో పుణ్యాన్ని, అంతులేని ఆధ్యాత్మిక అనుభూతులను మూటగట్టుకుని తిరుగు ప్రయాణవుతారు.






**పరవ శింపచేసే మానస సరోవరం
 **ఆంధ్రలేఖ ప్రతినిధి:.ఆదివారం అనుబంధం,
హిమాలయాల అద్భుత సౌందర్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవనే చెప్పాలి. ప్రకృతి తన సౌందర్య విశ్వరూపాన్ని ఇక్కడ ప్రదర్శిస్తూ వుంటుంది. ఇవి ఎన్నో పుణ్యక్షేత్రాలకు నిలయాలు. అన్నిట్లోకి భక్తులు అత్యంత పవిత్రంగా పరిగణించేది కైలాస పర్వతం. పరమ పవిత్రమైన మానస సరోవరం ఇక్కడే వుంది. మానస సరోవరాన్ని మానసరోవరం అని కూడా వ్యవహరిస్తూ వుంటారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఆల్మోరాకు 240 మైళ్ల దూరంలో, టిబెట్‌ రాజధాని లాసాకు 800 మైళ్ల దూరంలో లింగాకారంలో ఠీవీగా నిలిచి వుంది కైలాస శిఖరం. మాంధాతృ శిఖరం కూడా ఈ ప్రాంతంలోనే వుంది. ఈ రెండు శిఖరాల నీడలోనే నిర్మలమైన చల్లని నీటితో శోభిల్లుతూ ఉంటుంది దివ్య సరస్సుగా పేరుగాంచిన మానస సరోవరం.
ప్రపంచంలోకెల్లా ఎత్తైన పర్వతాలు హిమాలయ పర్వతాలే. ఇవి భారతదేశానికి ఉత్తర ప్రాంతంలో దాదాపు 1600 మైళ్ల దూరం వ్యాపించి మన దేశానికి పెట్టనిగోడల్లాగా భాసిస్తున్నాయి.
మాటలు చాలవు
హిమాలయాల అద్భుత సౌందర్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవనే చెప్పాలి. ప్రకృతి తన సౌందర్య విశ్వరూపాన్ని ఇక్కడ ప్రదర్శిస్తూ వుంటుంది. ఇవి ఎన్నో పుణ్యక్షేత్రాలకు నిలయాలు. అన్నిట్లోకి భక్తులు అత్యంత పవిత్రంగా పరిగణించేది కైలాస పర్వతం. పరమ పవిత్రమైన మానస సరోవరం ఇక్కడే వుంది. మానస సరోవరాన్ని మానసరోవరం అని కూడా వ్యవహరిస్తూ వుంటారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఆల్మోరాకు 240 మైళ్ల దూరంలో, టిబెట్‌ రాజధాని లాసాకు 800 మైళ్ల దూరంలో లింగాకారంలో ఠీవీగా నిలిచి వుంది కైలాస శిఖరం. మాంధాతృ శిఖరం కూడా ఈ ప్రాంతంలోనే వుంది. ఈ రెండు శిఖరాల నీడలోనే నిర్మలమైన చల్లని నీటితో శోభిల్లుతూ ఉంటుంది దివ్య సరస్సుగా పేరుగాంచిన మానస సరోవరం.
ఆది దేవుని నివాసం
కైలాస పర్వతం మీదే ఆదిదేవుడు శంకరుడు పార్వతీ సమేతంగా నివశిస్తూ వుంటాడని పురాణ కథనం. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో రవి కిరణ ప్రభావంవల్ల కైలాస శిఖరం బంగారు కొండలా శోభిస్తూ వుంటుంది. అపరాహ్ణ సమయంలో వెండికొండేమో అన్న భ్రమను కలిగిస్తూ వుంటుంది. ఆకాశం నిర్మలంగా వున్నప్పుడు కైలాస శిఖరం ప్రతిబింబాన్ని మానస సరోవరంలో చూడగలగడం ఓ అపూర్వ, దివ్యానుభవం.
పురాతన సరస్సు
మానస సరోవరాన్ని ట్యోమావంగ్‌ అనీ టోమాఫమ్‌ అనీ టిబెటియన్లు వ్యవహరిస్తుంటారు. అసలు ప్రపంచంలోనే మొదటగా ఏర్పడిన సరస్సు ఇదేనని భౌగోళిక శాస్త్రజ్ఞులు ఒప్పుకుంటున్నారు. ప్రపంచంలోకెల్లా అతి పురాతనమైన సరస్సు ఇదేననటంలో భేదాభిప్రాయాలు లేవు.
సముద్ర మట్టానికి 15 వేల అడుగుల ఎత్తులో 54 మైళ్ల చతురస్రంలో 300 అడుగుల లోతున గంభీరంగా వుండే మానస సరోవరం హిమాలయ పర్వతాలలో మొత్తమ్మీద 200 చదరపు మైళ్ల వైశాల్యంలో విస్తరించుకుని వుంటుంది. మానస సరోవరంలోని నీరు నీలవర్ణంలో అతి చల్లగా వుంటుంది. ఈ సరోవర్‌ ప్రాంతంలో సూర్యోదయం తెల్లవారుజామున నాలుగు గంటలకు సంభవిస్తే సాయంకాలం అయిదు గంటలకే సూర్యాస్తమయమైపోతుంది. సరోవరంలో సూర్యోదయ సూర్యాస్తమయ శోభలను చూసి ఆనందించవలసిందే కానీ వర్ణించడం అసాధ్యమేనని చెప్పవచ్చు.
ప్రకృతి వైచిత్రం
సరోవర ప్రాంతలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రతి గంటకు వాతావరణం మారిపోతూ వుంటుంది. గ్రీష్మ, వర్ష, శరత్‌, హేమంత, శిశిర, వసంత రుతు ప్రభావం ఇక్కడ గోచరిస్తూ వుంటుంది. మూడు గంటల తర్వాత వొంటిని గడ్డ కట్టించే ఉత్తర ధృవ శీతల వాయువులు జోరుగా వీస్తూ వుంటాయి. ఇటువంటి ఆసాధారణ ప్రకృతి వైచిత్రం మానస సరోవరం ప్రాంతానికే పరిమితం అని చెప్పవచ్చు.
మనో సంకల్ప ఫలం
రామయణం, భారతం ఇంకా అనేక పురాణ గ్రంథాలలో మానస సరోవర ప్రసక్తి వుంది. స్కంధపురాణంలో మానస స్కంధి అనే పేరుగల ప్రత్యేక ప్రకరణం వుంది. స్కంధ పురాణం ప్రకారం బ్రహ్మ మనోసంకల్పం వల్ల ఉద్భవించిన సరస్సు కాబట్టి దీనికి మానస సరోవరం అని పేరు వచ్చినట్లు తెలుస్తోంది. మాంధాత చక్రవర్తి మానస సరోవరం చుట్టూ యాత్రికుల కోసం అనేక సౌకర్యాలు ఏర్పాటు చేశాడని కూడా అంటారు.
కైలాస శిఖరానికి తూర్పువైపున ''గౌరీకుండం'' అనే పేరుగల సరస్సు వుంది. గౌరీ కుండంలో స్నానం చేసినట్లయితే సకల పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం. అయితే సంవత్సరమంతా కూడా గౌరీకుండంలోని నీరు గడ్డకట్టే వుంటుంది. భక్తులు ఆ మంచుగడ్డలనే పగలకొట్టి వచ్చిన నీటినే తలపై పోసుకుని తరిస్తారు. మానస సరోవర తీరంలో కొంత ప్రాంతం బురదమయంగా వుంటే మరికొంత ప్రాంతం శిలాసదృశ్యంగా వుంటుంది. మరొక చోట చల్లగా వుంటే మరొకచోట వెచ్చగా వుంటుంది. అసలు సరస్సు పరిసరాలలోనే అనేక చిన్న చిన్న మడుగులు కూడా వున్నాయి. మొత్తమ్మీద ప్రకృతి తన వైచిత్రాలన్నింటినీ ఇక్కడే పోగుపోసిందా అన్నట్లు వుంటాయి ఇక్కడి భౌగోళిక వాతావరణ పరిస్థితులు.
నాలుగు నదుల పుట్టుక
మానస సరోవర ప్రాంతంలో నాలుగు నదులు ఉద్భవించి ప్రవహిస్తూ వుంటాయి. గంగానది కైలాసం నుండి ఈ సరోవర ప్రాంతంలోనే కిందికి దూకినట్లు కైలాస పురాణం చెబుతోంది. అలా గంగ కిందికి దూకినప్పుడు ఎర్పడిన జలనిధి నుంచే నాలుగు దివ్యమైన నదులు ఉద్భవించాయట. బ్రహ్మపుత్ర, కర్ణాళీ గంగ, సట్లెజ్‌, సింధునదులు మానస సరోవర ప్రాంతంలో ఉద్భవించి కైలాస మానస సరోవరాలకు ఏడుసార్లు ప్రదక్షిణలు చేసి వాటి వాటి మార్గాలలో వ్రపహిస్తూ వుంటాయి. కర్ణాళిగంగ ఉద్భవించు స్థలం మయూర ముఖం మాదిరిగా వుండగా, బ్రహ్మపుత్ర అశ్వముఖ రూపంలో ఉన్న స్థలంలో నుండి దూకుతూ వస్తుంది. సింధునది వెలువడే తావు మృగరాజు ముఖం మాదిరి వుంటుంది. ఇక సట్లెజ్‌ నది ఏనుగు ముఖ ద్వారం నుండి ఉద్భవించి గజగమనాలు ఒలికిస్తూ ప్రవహిస్తూ వుంటుంది. మానస సరోవరం తీరంలో ఔషధ విలువలు కలిగిన అమూల్యమైన అనేక వనమూలికలు లభిస్తూ వుంటాయి. అంతేగాక స్వర్ణ రజస్సుతో మిళితమైన ఇసుక కూడా సరోవర తరంగాలతో పాటు కొట్టుకుని వస్తూ వుంటుంది.
రావణ సరోవరం
మానస సరోవరానికి కొద్ది మైళ్ల దూరంలో రాక్షస సరోవరం లేక రావణ సరోవరం అనే పేరుగల మరో సరస్సు వుంది. రావణాసురుడు శంకరుణ్ణి ప్రసన్నం చేసుకోడానికి తపమాచరించినట్టు ప్రతీతి. రావణ సరస్సు గర్భంలో మునిగిపోయి ఐదు పర్వతాలున్నాయని కూడా అంటారు. రాక్షస సరోవరం 77 మైళ్ల వైశాల్యంలో విస్తరించుకుని వుంది. ఈ సరస్సులోకి మానస సరోవరంలో నుండి నీరు వచ్చి చేరుతూ వుంటుంది. గంగాఛు అనే మార్గం ద్వారా మానస సరోవరంలో నుండి జలం రావణ సరస్సులోకి చేరుతూ వుంటుంది. ఇందుకు సంబంధించి ఓ చక్కని కథ కూడా టిబెట్‌లో ప్రచారంలో వుంది.
విషాదం కూడా
ఇంతటి అద్భుత సౌందర్యంలోనూ ఆనంద దృశ్యాలలోనూ అంతులేని విషాదం కూడా అప్పుడప్పుడూ చోటు చేసుకుంటూ వుంటుంది. సరోవరంలోని నీరు గడ్డకట్టుకుపోయినప్పుడు వేలాది చేపలు కూడా మంచుగడ్డలతో బిగుసుకుపోతాయి. సజీవంగా మంచు సమాధి అయిపోయిన ఈ చేపలు మంచు గడ్డలలోంచి కనపడుతూనే వుంటాయి కూడా. అలాగే బాతులు, హంసలు వాటి చిన్న పిల్లలతో సహా హఠాత్తుగా మారే వాతావరణ ప్రభావానికి గురై మంచు గడ్డల్లో బిగుసుకుపోతాయి. ఒక్కోసారి గొర్రెలు, మేకలు కూడా ఈ ప్రాంతంలోని ప్రకృతి వైచిత్యం వల్ల మంచు సమాధిలో మునిగిపోతూ వుంటాయి. ఇటువంటి దృశ్యాలు మానస సరోవర ప్రాంతంలో సర్వసామాన్యమే.
సరోవర ధ్వనులు
నిర్మలమైన మానస సరోవరంలో నుండి ఒక్కొక్కసారి వింత వింత శబ్దాలు వినపడుతూ వుంటాయి. ఈ శబ్దాలు జనవరి నెలలో వినపడడం ప్రారంభించి వసంతం అడుగు పెట్టేవరకు కొనసాగుతూ వుంటాయి. ఈ మధ్య కాలంలో అదివరకు సరోవరంలో గడ్డకట్టిన మంచు శతసహస్ర శకలాలుగా విడివడి క్రమంగా కరిగి చివరికి వినిర్మలమైన శుద్ధమైన పవిత్ర జలంలో కళకళలాడుతూ ఉంటుంది. ఇన్ని వింతలకు ఆలవాలమైన పవిత్రమైన మానస సరోవరాన్ని సందర్శించి పుణ్యం మూట కట్టుకోవాలిని భక్తులు తహతహలాడుతూ వుంటారు. అయితే చైనా వారి ఆధీనంలో ఉన్న కారణంగా మానససరోవర ప్రాంతాన్ని దర్శించడానికి వారినుండి అనుమతి పొందాల్సిన అవసరం వుంది. ఇటీవల నింబంధనలను సులభతరం చేసి మానస సరోవరాన్ని యాత్రికులు సందర్శించే వీలును చైనా ప్రభుత్వం వారు కల్పింస్తున్నారు. దాంతో భక్తుల పాలిట కొంగు బంగారం లాంటి మానస సరోవర యాత్ర కాస్త సుగమం అయింది.
మౌంట్ కైలాష్ యొక్క హిందూ ప్రాముఖ్యత ను వివరిస్తూ శివడు, పార్వతి, గణేశ మరియు మురుగా (కార్తికేయ) కలిగిన పవిత్ర శివుని కుటంబం
మూస:
హిందూ మతం ప్రకారం దుష్ట శక్తులను, బాధలను నశింపజేసే శివ భగవానుడు కైలాశ పర్వతమనబడే ప్రఖ్యాత పర్వతపు శిఖరాగ్రంలో నివశిస్తాడు, ఇక్కడ ఈయన తన భార్య పార్వతితో కలిసి నిరంతర ధ్యాన స్థితిలో ఉంటాడు.
చార్లెస్ అల్లెన్ ప్రకారం విష్ణు పురాణంలోని పర్వతం గురించిన ఒక వివరణ దీని నాలుగు ముఖాలు స్ఫటికం, రూబీ, బంగారం మరియు లాపిస్ లజూయితో నిర్మితమయ్యాయి.[5] ఇది ప్రపంచపు పునాది, ఇది తామర పువ్వు ఆకృతిగల ఆరు పర్వత ప్రాంతాల మధ్యలో ఉంది.[5] కైలాశం నుంచి మొదలయ్యే నాలుగు నదులు ప్రపంచపు నాలుగు భాగాలకి ప్రవహించి ప్రపంచాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తున్నాయి.[5]
పెద్ద, అతి ముఖ్యమైన మహారాష్ట్రపు ఎల్లోరా రాతి గుడి కైలాష గుడి పేరు కైలాష పర్వతం పేరు మీద పెట్టబడింది. దీనిలోని అనేక శిల్పాలు శివ భగవానుడి, పార్వతి అమ్మకి సంబంధించిన రావణుడి కథతో సహా కథలని చిత్రించినవే. (రావణుడు శివ భక్తుడు. రామాయణం రావణుడు కైలాశ పర్వతాన్ని కదిలించిన వైనాన్ని చెప్పదు.) రావణుడి తల్లి వ్యాధిగ్రస్తమవుతుంది. వారు గొప్ప శివ భక్తులు కావున అతను గుడిని తన వీపు మీద పెట్టుకొని తల్లికి దగ్గరగా తీసుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. శివుడు అతని ధైర్యానికి మెచ్చి అతను తను పెట్టిన భక్తి పరీక్షలో నెగ్గినందున అతనికి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు.[6]

బుద్దిజంలో[మార్చు]

టిబెటన్ తన్గ్క వర్ణన Mt. కైలాష్
తాంత్రిక బౌద్ధులు కైలాశాన్ని బుద్ధ డెంచోక్ (డెంచోగ్ లేదా చక్రసంవర అని కూడా అంటారు)[7] నివాసంగా భావిస్తారు, ఈయన శాశ్వతానందానికి ప్రతినిధి. మూస:Tibetan Buddhism ఇక్కడి చాలా ప్రదేశాలు గురు రింపోచే (పద్మసంభవుడు)తో సంబంధం కలిగిఉన్నాయి, ఈయన టిబెట్ చుట్టుప్రక్కల చేసిన తాంత్రిక అభ్యాసాలు 7-8 CE శతాబ్దాలలో ఈదేశంలో బుద్ధిజం ప్రధాన మతంగా పరిణామం చెందడానికి దోహదమయ్యాయి.[8]
మౌంట్ కైలాష్ క్రింద స్థూపాలు
మిలరేపా (c. 1052-c.
తాంత్రిక బుద్ధిజపు విజేత టిబెట్ బోన్ మతపు విజేత నారో బోన్-చుంగ్ ని సవాలు చేయడానికి టిబెట్ వచ్చాడని చెపుతారు. ఈ ఇద్దరు మంత్రవాదులు భయంకర మాయజాల యుద్ధం చేసారు కానీ ఎవరూ నిర్ణయాత్మక లాభాన్ని పొందలేదు. చివరికి కైలాశ పర్వత శిఖరాగ్రాన్ని ఎవరైతే ముందుగా చేరతారో వారే విజేత అనే ఒప్పందం కుదిరింది. అయితే నారో బోన్-చుంగ్ మాయ డ్రమ్ము మీద కూర్చొని పెకి ఎగబ్రాకాడు, మిలరేపా అనుయాయులు అతను కూర్చొని ఇంకా ధ్యానం చేయడాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు. నారో బోన్-చుంగ్ పైకి దగ్గరగా వెళ్ళినపుడు మిలరేపా హటాత్తుగా రంగంలోకి దిగి సూర్య కిరణాల మీద ప్రయాణం చేసి అతన్ని దాటేసి పోటీని గెలిచాడు. అతను చేసిన గుప్పెడు మంచుని దగ్గరిలోని పర్వతపు అగ్రానికి విసరడం అప్పటినుండి బోన్రిగా పిలవబడే బోన్పో మరణ శాసనం ఆప్రాంతపు బోన్పో సంబంధాలని కొనసాగించేలా చేసింది.[9] 
[10][11]

బోన్ లో[మార్చు]

టిబెట్ లో బుద్ధిజంను ఎదిరించే బోన్ మతం మొత్తం మార్మిక ప్రాంతం, తొమ్మిది-కథల స్వస్తిక పర్వతం ఆధ్యాత్మిక శక్తి అంతటికీ కేంద్రంగా భావిస్తారు.
== తీర్థయాత్ర
==
మానసరోవర్(కుడివైపు)మరియు ముందువైపు రాక్షస్తల్ కలిగిన మౌంట్ కైలాష్ యొక్క శాటిలైట్ దృశ్యం
ప్రతిసంవత్సరం వేల సంవత్సరాలనాటి సంప్రదాయాన్ని పాటిస్తూ వేలమంది కైలాష్ కి తీర్థయాత్ర చేస్తారు. అనేక మతాలకి చెందిన యాత్రికులు కైలాష్ ని పాదాలతో చుట్టిరావడం మంచి పుణ్యాన్ని కలిగించే పవిత్ర ఆచారంగా నమ్ముతారు. హిందువులు, బౌద్ధులు ఈయాత్రని దక్షిణావర్త దిశలో చేస్తారు. జైన, బోన్ పో మత అనుయాయులు ఈ పర్వతాన్ని అపసవ్య దిశలో చుడతారు. కైలాష పర్వతం చుట్టూ ఉన్న దారి 52 km (32 mi)పొడవైనది.
కొంతమంది యాత్రికులు కైలాష పర్వత యాత్ర అంతా ఒక్కరోజులోనే చెయ్యాలని నమ్ముతారు. అదంత సులభం కాదు. మంచి ఆకృతి గల వేగంగా నడిచే మనిషి ఈ 52km పూర్తి చెయ్యడానికి దాదాపు 15 గంటలు పడుతుంది. అస్థిర వాతావరణం, ఎత్తువల్ల వచ్చే అస్వస్థత, ఈ ప్రక్రియలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులకి కొంచెం భయపడినప్పటికీ కొంతమంది భక్తులు ఈ సాహసాన్ని పూర్తిచేస్తారు. అలాగే ఇతర యాత్రికులు ఇంకొంచెం ఎక్కువ పథ్యాన్ని పాటిస్తూ చేస్తారు, మొత్తం ప్రదక్షిణ అంతా సాష్టాంగ నమస్కారాలు చేస్తూ చేస్తారు: యాత్రికుడు వంగి మోకాళ్ళ మీద కూర్చొని మొత్తం సాగిలపడి వేళ్ళతో గుర్తు చేసి మోకాళ్ళ మీద లేచి ప్రార్థించి చేతులతో, మోకాళ్ళతో అక్కడివరకు ప్రాకి మళ్లీ మళ్లీ ఈ పద్ధతిని పునరావృతం చేస్తారు. ఈ పథ్యాన్ని పాటిస్తూ ప్రదక్షిణ పూర్తి చేయడానికి కనీసం నాలుగు వారాల శారీరక ఓరిమి అవసరమవుతుంది. ఈ పర్వతం టిబెటన్ హిమాలయాలలో మూలన ఆశ్రయం ఇవ్వడానికి ఎవరూ లేని చోట ఉంది. యాత్రికుల సౌకర్యార్థం కొన్ని ఆధునిక వసతులైన బెంచీలు, విశ్రాంతి ప్రదేశాలు, ఉపాహార కేంద్రాలు ఏర్పాటుచేయబడ్డాయి. ఈ పర్వతాన్ని పూజించే అన్ని మతాల ప్రకారం దీని వాలులలో కాలు పెట్టటం మహా పాపం. ఈ మూఢ నమ్మకాన్ని తొలగించడానికి ప్రయత్నించిన వారంతా ఆ ప్రయత్నంలో మరణించారని చెపుతారు[citation needed].
Mt కైలాష్ యొక్క ప్రదేశం
1950లో చైనిస్ సైన్యం టిబెట్ లో అడుగు పెట్టిన తరువాత, చైనిస్-ఇండియన్ సరిహద్దులలో నెలకొన్న రాజకీయ, సరిహద్దు అనిశ్చితి వలన శివ భగవానుడి నివాసానికి చేసే తీర్థయాత్ర 1954 నుండి 1978 వరకు నిలిపివేయబడింది. దానితరువాత పరిమిత సంఖ్యలో భారతీయ తీర్థయాత్రికులు ఈ ప్రదేశాన్ని దర్శించడానికి అనుమతి లభించింది, వీరు చైనిస్ మరియు భారతీయ ప్రభుత్వాల పర్యవేక్షణలో సుదీర్ఘమైన, క్లిష్టమైన హిమాలయాల అధిరోహణ చేస్తారు, భూమార్గం గుండా కాట్మండు నుండి లేదా లాసా నుండి విమానాల ద్వారా టిబెట్ చేరుకొని అక్కడినుండి గొప్ప టిబెటన్ పీఠభూమిని కారులో చుడతారు. ఈ ప్రయాణం నాలుగు రాత్రులు పడుతుంది, చివరికి దార్చేన్ చేరతారు,4,600 m (15,100 ft) ఇక్కడి చిన్న అవుట్ పోస్ట్ ప్రతి సంవత్సరం ప్రత్యేక సమయంలో తీర్థయాత్రికులతో నిండిపోతుంది. కనిష్ట సౌకర్యాలు కలిగి ఉన్నప్పటికీ విదేశీ తీర్థ యాత్రికుల కోసం ఆధునిక గెస్ట్ హౌసులు అందుబాటులో ఉన్నాయి, అదే టిబెటన్ తీర్థ యాత్రికులయితే సాధారణంగా వారి సొంత టెంట్లలో నిద్రపోతారు. సుదూర-తూర్పు టిబెట్ లోని స్విస్ కోర్సం ఫౌండేషన్ నిదులన్దించే చిన్న ప్రాంతీయ వైద్య కేంద్రం 1997లో ఇక్కడ స్థాపించబడింది.
పవిత్ర పర్వతం చుట్టూ నడవడం-దీని భాగమైన అధికార వనాన్ని చూడడం కూడా నడకతోనే, పోనీ లేదా యాక్ చేరుకోవడానికి దాదాపు15,000 ft (4,600 m) టర్బోచే (జెండా స్థంభం) ఎత్తు నుండి ట్రెక్కింగ్ ప్రారంబిస్తే మూడు రోజులు పడుతుంది, డ్రోల్మ పాస్18,200 ft (5,500 m) దాటాక దారిగుండా రెండు రాత్రులు పడుతుంది. మొదట దిరాపుక్ గొంప మైదానం దగ్గర కొంచెం పాస్ కి ముందు,2 to 3 km (1.2 to 1.9 mi) రెండు పాస్ దాటిన తరువాత సాధ్యమైనంత క్రిందకి దిగిన తరువాత (దూరంలో గౌరీ కుండ్ ని చూడటం).

కైలాసంపై శివుడున్నాడా?


మంచుకొండల్లో.. వెండి వెన్నెల
అతీంద్రియ మహాశక్తులు
అంతు పట్టని వెలుగు దివ్వెలు
సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో
సైన్‌‌సకు అందని అసాధారణ వ్యవస్థ
కైలాసం
పరమ శివుడి ఆవాసం
ఆదిశక్తి పార్వతి నివాసం
రావణుడు పది తలలతో ఎత్తిన కైలాసం
ఈ భూమిపైనే ఉంది..
మన కళ్ల ముందు ఉంది
మనకు కనిపిస్తోంది
భూమిపైనే దేవుడు కొలువై ఉన్నాడు
భక్తులకు
శివ అనుగ్రహం లభిస్తోంది..
సముద్ర మట్టానికి
21,778
అడుగుల ఎత్తులో
52
కిలోమీటర్ల విస్తీర్ణంలో
మంచుకొండల నడుమ
 
కైలాస పర్వతం
ఈ కొండపైనే రుద్రతాండవం
లయకారుడి లయవిన్యాసం
త్రినేత్రుడి సాక్షాత్కారం
కైలాసంపై ఈశ్వరుడి ఉనికి నిజం
దైవత్వానికి మహాదేవుని నిర్వచనం
కైలాస పర్వతంపైభాగంలో ఏముంది?
ఎవరికీ తెలియని అంతులేని రహస్యం ఏమిటి?
భూమిపైనే ఈశ్వరుడి ఉనికి నిజమేనా? 
.............
నిజమే---- పరమేశ్వరుడు ఈ భూమిపైనే ఉన్నాడు.. మనముంటున్న ఈ నేలపైనే నివాసమున్నాడు.. అవును ఇది అక్షరాలా నిజం.. ఇక్కడే.. ఈ గాలిలో, ఈ నేలలో ఈ మట్టిపైనే ఆయన ఉన్నాడు.. భక్తులకు సాక్షాత్కరిస్తున్నాడు.. వారి మనోరథాల్ని నెరవేరుస్తున్నాడు.. శివుడి కైలాసం భూమిని దాటి మరెక్కడో లేదు. ఆయన కైలాసం ఇక్కడే ఉంది.. మన దేశానికి కూతవేటు దూరంలో ఉంది.. సిద్ధ పురుషులకు ఆవాసమైన మంచుకొండల నడుమ ఉంది. ఈ కైలాసంపైనే శివుడు ఉన్నాడు.. ఆయన ఉనికి అక్కడ స్పష్టంగా ఉంది.. సైన్‌‌సకు అంతుపట్టని అపురూప శక్తి ఏదో అక్కడ దాగి ఉంది.
....
సశరీరంతో కైలాసానికి  వెళ్లటం గురించి విన్నాం.. కానీ, ఇప్పుడు ఇది వాస్తవం.. కైలాసానికి మనం బొందితోనే వెళ్లవచ్చు.. తిరిగి రానూ వచ్చు. కాకపోతే కొద్దిగా ఫిట్‌నెస్‌ అవసరం. ఫిట్‌నెస్‌ ఉంటే కైలాసానికి వెళ్లి పరమ శివుని చూసి చక్కగా తిరిగి రావచ్చు.
కైలాసానికి శరీరంతో ఎలా వెళ్లగలమని ఆలోచించకండి.. కైలాసం మన భూమిపైనే ఉంది. హిమాలయ పర్వతాలలో ఉంది. సముద్ర మట్టానికి 22778 అడుగుల ఎత్తులో ఉంది.. టిబెట్‌ భూభాగంపై ఉన్నది. ఈ కైలాసంపైనే శివపార్వతులు కొలువై ఉన్నారు.. వేలాది భక్తులకు దర్శనమిస్తున్నారు..
 
మౌంట్‌ కైలాస్‌ ప్రపంచంలో స్పిర్చు్యవాలిటీ  సంపూర్ణంగా  వ్యాపించిన ఏకైక  ప్రాంతం. ఇక్కడికి వెళ్లి వచ్చిన ప్రతి భక్తుడికి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతోంది. ఏదో ఒక రూపంలో ఉమాశంకరుల దర్శనం జరుగుతోంది.
ఉమాశంకరులే కాదు.. శివపార్వతుల ఫ్యామిలీ అంతా ఇక్కడ కొలువై ఉన్నది. కైలాస పర్వతం చుట్టూ ట్రెకింగ్‌ చేస్తున్న కొద్దీ ఒక్కో రూపం మనకు దర్శనమిస్తుంది. నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి ఒక్కో చోట  ఒక్కో రూపంలో భక్తులకు కనిపిస్తారు..
మౌంట్‌ కైలాస్‌ ఎవరికీ తెలియని ఓ రహస్యమే. ఇది మామూలు పర్వతం కాదు.. హిమాలయ శ్రేణుల్లో ఏ పర్వతానికీ లేని ప్రత్యేకతలు ఇక్కడ చాలా కనిపిస్తాయి. అర్థం కాని రహస్యాలు అనేకం ఇక్కడ దాగున్నాయి. ఇది నాలుగు వైపులా నాలుగు రూపాల్లో ఉంటుంది. నాలుగు రత్నాల్లో , నాలుగు రంగుల్లో దర్శనమిస్తుంది. ప్రపంచంలోని వండర్‌‌స అన్నింటికీ వండర్‌ మౌంట్‌ కైలాస్‌.   
-1-
దేవుణ్ణి దర్శించాలంటే కఠిన మైన నియమాలు పాటించాలి. తపస్సు చేయాలి. ఉపాసన చేయాలి. యజ్ఞ యాగాదులు చేయాలి.. ఇంకా ఏవేవో చెప్తారు మన పెద్దలు.. దేవుణ్ణి చూడటం అంటే అంత తేలికైన వ్యవహారం ఏమీ కాదు..ఎంత కష్టపడితే తప్ప.. సాధ్యం కాదని చెప్పటమే వీటన్నింటి ఉద్దేశం..
కైలాస్‌ మానస్‌ సరోవర్‌ యాత్ర అచ్చంగా అలాంటిదే.. అన్ని కష్టాలకూ పరాకాష్ట.. ఊపిరి కూడా తీసుకోవటం కష్టమైన యాత్ర..సముద్ర మట్టానికి ఎన్నో వేల అడుగుల ఎత్తు... ఆక్సీజన్‌ అంతంత మాత్రం.. అసలు వేడి అంటే ఏమిటో మచ్చుకైనా తెలియని వాతావరణం.. శరీరం రాయిలా బిగుసుకుపోయేంత చలి.. ఇతర తీర్థయాత్రా స్థలాల్లో కనిపించే కనీస సౌకర్యాలు ఉండవు.. ఇలాంటి చోట 52 కిలోమీటర్లు ట్రెకింగ్‌  చేయాలి..
ఈ యాత్ర ఒక జీవిత కాలం తపస్సు కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. ఖాట్మండు మీదుగా ప్రారంభమయ్యే యాత్ర తారాపీఠ్‌, గౌరీకుండం మీదుగా కైలాస్‌ చేరుకుంటారు.. ఇక్కడికి వెళ్లాలంటే ముందుగానే ఫిట్‌నెస్‌ చెక్‌ చేయించుకోవలసి ఉంటుంది.. అన్ని విధాలా ఆరోగ్యం సరిగ్గా ఉంటేనే కైలాస్‌ యాత్రకు అనుమతిస్తారు...
కైలాస్‌ పర్వతానికి చేరుకోవటం అంటే మృత్యువును ఎదిరించి ముందుకు పోయినంత సాహసమే..పర్వతాన్ని ఒకసారి చుట్టి రావటానికి కనీసం నాలుగు రోజుల సమయం పడుతుంది. ఆక్సీజన్‌ అతి తక్కువగా ఉన్న ప్రదేశంలో నాలుగు రోజుల పాటు నడవటం ఎంత కష్టమో వేరే చెప్పేదేముంది?
శరీర కష్టం కంటే మానసిక సై్థర్యంపైనే, ఆధ్యాత్మిక బలంపైనే కైలాస్‌ పర్యటన కొనసాగుతుంది. కైలాసం శివుడి పూర్ణస్వరూపమని విశ్వాసం. అక్కడకు వెళ్లిన అనేక మంది భక్తులకు పర్వతం ఆసాంతం శివరూపంగా దర్శనమిచ్చిన తార్కాణాలు ఉన్నాయి. విచిత్రమేమంటే కైలాస పర్వతం దగ్గరకు వెళ్లిన యాత్రికులు, పర్వతాన్ని మాత్రం అధిరోహించే ప్రయత్నం చేయరు.. పర్వత పాదాన్ని తాకే ప్రయత్నమైనా చేయరు.. వెళ్లేందుకు ఎవరు సాహసించినా అంతే సంగతులని చెప్తారు. ఇది ఎంతవరకు నిజం.. ఎవరెస్టును సైతం అధిరోహించిన మనిషి  కైలాస పర్వతంపైకి మాత్రం ఎందుకు వెళ్లలేకపోతున్నాడు..
కైలాస పర్వతం పైకి అధిరోహించటం అంత తేలికైన సంగతేం కాదు.. పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేయటం తప్ప, దాన్ని తాకేందుకు కూడా ప్రజలు భయపడతారు..ఎవరెస్టు ఎక్కటానికి లేని భయం కైలాసం తాకటానికి ఎందుకు? కైలాసం ఉపరితలంపై ఏముంది.. కనీసం హెలికాప్టర్లు కూడా దీని పైభాగం నుంచి వెళ్లేందుకు సాహసించలేని పరిస్థితి వెనుక మర్మమేమిటి?
-2-
ఈ భూమిపై హిమాలయాలు ఏర్పడి సుమారు పది మిలియన్ల సంవత్సరాలు అయినట్లు సైంటిస్టులు చెప్తారు. కైలాస్‌ పర్వతం వయసు కూడా బహుశా అంతే అయి ఉండవచ్చు.  అయితే మిగతా హిమాలయ పర్వతాలకు, కైలాసానికి స్పష్టమైన తేడా ఉంటుంది. కైలాస్‌ పర్వతం ఒకప్పటి అఖండ భారతానికి సెంటర్‌ పాయింట్‌లో ఉంది. గురుత్వాకర్షణ శక్తికి గరిమనాభి ఎలాంటిదో.. అఖండభారతానికి సెంటర్‌ పాయింట్‌ కైలాసం..
ఆరు హిమాలయ పర్వత శ్రేణులకు మధ్యలో కైలాస పర్వతం ఉంది.. ఒక విధంగా చూస్తే కమలం ఆకారంలో కనిపిస్తుంది..
కైలాస్‌ పర్వతం నాలుగు వైపుల నాలుగు రంగుల్లో కనిపిస్తుంది. ఒక వైపు నుంచి చూస్తే పూర్తిగా స్ఫటికంలా కనిపిస్తుంది. ఇంకో వైపు నుంచి చూస్తే బంగారు వర్ణం గోచరిస్తుంది.. మూడో వైపు రూబీలాగా, నాలుగో వైపు నీలం రాయిగా గోచరిస్తుంది.
అంతే కాదు..  కైలాసానికి నాలుగు రూపాలూ ఉన్నాయి. ఒకవైపు గుర్రంగా, ఇంకోవైపు సింహంగా, మూడో వైపు ఏనుగుగా, నాలుగో వైపు నెమలిగా కనిపిస్తాయి.. ఇందులో  గుర్రం హయగ్రీవ రూపం కాగా, సింహం పార్వతీదేవి వాహనం, ఏనుగు విఘ్నేశ్వరుడికి ప్రతీక అయితే, నెమలి కుమారస్వామికి వాహనం.. ఇవన్నీ ఈశ్వర స్వరూపానికి ప్రతీకలుగా పురాణాలు చెప్తాయి.
కైలాస్‌ పర్వతంలో అత్యంత కీలకమైన విషయం దక్షిణ ఆసియాను సస్యశ్యామలం చేస్తున్న  నాలుగు పవిత్ర నదులు ఈ ప్రాంతం నుంచే ఉద్భవించటం..గంగ, సింధు, బ్రహ్మపుత్ర, సట్లెజ్‌ నదులు ఇక్కడి నుంచే కిందకు ప్రవహిస్తాయి..
మంచు పూర్తిగా కప్పుకున్నప్పుడు వెండికొండలా మిలమిల మెరిసే కైలాస దర్శనం అద్భుతం. ఈ పర్వత పాదపీఠంలో బ్రహ్మమానస సరోవరం మరో అపురూపం.. స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి ఉండదని చెప్పే సైన్‌‌స మాటను నిజం చేసే సరస్సు ఇది. నీటికి ఇంత స్వచ్ఛత ఈ భూమిపై కన్ను పొడుచుకుని చూసినా కనిపించదు. పరమేశ్వరుడు ఈ సరస్సులో స్నానం చేస్తాడని భక్తుల విశ్వాసం..కైలాసం మీదుగా సరస్సులోకి ఒక జ్యోతి ప్రవేశించటం ఇక్కడికి వచ్చిన చాలా మందికి అనుభవమే.
కైలాసం పైకి అధిరోహించటం ఇప్పటికి ఎవరి వల్లా సాధ్యం కాలేదు. పదవ శతాబ్దంలో బౌద్ధ మతగురువు మిర్లెపా కైలాస పర్వతాన్ని ఎక్కినట్లు చెప్తారు. అంతకు ముందుకానీ, ఆ తరువాత కానీ, ఎవరూ దీన్ని స్పృశించేందుకు కూడా సాహసించలేదు.. సాహసించిన వారు కనిపించకుండా అదృశ్యమైపోయారని చెప్తారు.. 1954లో కైలాస్‌ యాత్రను నిషేధించిన చైనా కూడా  దీనిపై ప్రయోగం చేసి విఫలమైంది. రెండుసార్లు హెలికాప్టర్లు పంపిస్తే  అవి తిరిగి రాలేదు. ఆ తరువాత ఎవరూ సాహసించలేదు...
ఎన్నో ప్రయోగాలు జరిగాయి.. ఏమీ తేలలేదు.. ఇప్పటి వరకు కైలాస్‌ పర్వతం అవుటర్‌ సర్కిల్‌లో తిరిగిన వాళ్లే తప్ప ఇన్నర్‌ సర్కిల్‌లోకి ప్రవేశించిన వాళూ్ల లేరు.. 21సార్లు అవుటర్‌ సర్కిల్‌లో తిరిగిన తరువాత ఇన్నర్‌ సర్కిల్‌లోకి వెళ్లే అవకాశం లభిస్తుంది. అది అంత తేలిక కాదు.. అఘోరాల్లాంటి వాళ్లకు కానీ సాధ్యం కాదు.. ఇంత క్లిష్టమైన పర్వతం ఉపరిభాగంపై ఏమున్నదన్నది సైన్‌‌సకు మాత్రం అందలేదు.. భక్తులకు మాత్రం కైలాసంపై శివుడు సాకారంగా సాక్షాత్కరిస్తున్నాడు.. ధ్యానముద్రలో కనిపిస్తున్నాడు. లింగరూపుడై దర్శనమిస్తున్నాడు. కోరిన కోరికలన్నీ తీరుస్తున్నాడు....ఇది విశ్వాసానికి, ఆధ్యాత్మికతకు అతీతమైంది.. అంతు చిక్కనిది.
కైలాస్‌ దర్శనం భక్తులకు ఒక అపూర్వ అనుభూతి.. హిమాలయ సానువుల్లో సువర్ణభాండం.. పరమేశ్వరుడి దివ్యధామం.. పార్వతి దేవీ కొలువైన పవిత్ర క్షేత్రం. అణువణువులోనూ శివస్వరూపాన్ని నింపుకున్న ప్రాంతం. మాటల్లో వర్ణించలేని భావమది. పదాలకు అందని పవిత్రత అది. అందుకే భక్తులు మానస సరోవరాన్ని భూలోక కైలాసంగా పిలుచుకుంటారు

దేవతలు కొలువుండే కైలాస పర్వతం

కైలాస పర్వతం... సముద్రమట్టానికి 22,028 అడుగుల ఎత్తైన మహోన్నతమైన ఆధ్యాత్మిక శిఖరం. కైలాస పర్వతం మరియు చేరుకోవడానికి సాగించే ప్రయాణం అంతరాత్మ పిలుపుగా భక్తులు భావిస్తుంటారు. పవిత్రమైన ఈ ఆధ్యాత్మిక నెలవులో వేల సంఖ్యలో మహర్షులు, సామాన్య మానవులు, తత్వవేత్తలు మరియు దేవతలు సైతం ధ్యాన ముద్రలో ఇక్కడి పవిత్రవాతావరణంలో మమేకమైపోతారు.

కైలాస పర్వతం స్వయంభువుగా అవతరించింది. కైలాస పర్వతం మరియు మానవసరోవరం సృష్టికన్నా పురాతనమైనవిగా ప్రతీతి. నాదం మరియు కాంతులతో మిళితమైన ఈ ప్రాంతంలో నిజమైన యోగి ఓంకారంలో విలీనమైపోతారు. భారతీయ తాత్విక చింతన మరియు నాగరికతకు ఈ ప్రాంతం హృదయ కేంద్రం వలె భాసిల్లుతున్నది. గొప్పదైన మానవసరోవరం భారతీయ చైతన్యాన్ని ప్రతిబింబిస్తోంది.

పర్వతం యొక్క ఏటవాలు భాగాన్ని కల్ప వృక్షం ఆపాదించుకున్న రీతిలో కనిపిస్తుంది. పర్వతం యొక్క దక్షిణ భాగం నీలమణి, తూర్పు భాగం స్ఫటికం, పశ్చిమ భాగం కెంపు మరియు ఉత్తర భాగం స్వర్ణంగా చెప్పబడింది. కుబేరుని రాజ్యం ఇక్కడే కొలువై ఉంది. మహావిష్ణువు కాలి బొటనవేలి నుంచి ఉద్భవించిన గంగా నది
WD Photo
WD
చాంద్రమాన వృత్తంలో ప్రవేశించి అనంతరం కైలాస పర్వత శిఖరం నుంచి దివికి ఏతెంచింది. గంగానది ఉధృతిని నియంత్రించేందుకు మహాశివుడు ఆమెను తన జటాజూటంలోకి స్వీకరించాడు.

బౌద్ధులకు అత్యంత ముఖ్యమైన పుణ్య క్షేత్రంగా ఈ ప్రాంతం పూజలను అందుకుంటోంది. కైలాస పర్వత శిఖరంపై కొలువైన డెమ్‌చొక్ ( బుద్ధుని ఉగ్రరూపం) ను బౌద్ధ మతస్థులు పూజిస్తుంటారు. దీనినే ధర్మపాలగా పిలుస్తుంటారు. తమను నిర్వాణానికి చేర్చే పుణ్యధామంగా బౌద్ధ మతస్థులు ఈ క్షేత్రాన్ని బలంగా విశ్వసిస్తుంటారు. తొలి తీర్థాంకరులు ఇక్కడే నిర్వాణం పొందారని జైన మతస్థుల నమ్మిక. గురునానక్ ఇక్కడే ధ్యానం చేశారని కొందరు చెప్తుంటారు

WD Photo
WD
కైలాస పర్వతం మరియు పర్వత సానువులోని మానవ సరోవరానికి చెందిన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత బహుముఖమైంది. సర్వ మతాలకు చెందిన అన్ని వయస్సుల వారు వేర్వేరు మార్గాలలో ఈ ప్రాంతాన్ని పూజిస్తుంటారు. ఈ ప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని బహుళ జనాదరణ పొందిన పురాణాలు మరియు కల్పనలు సర్వమత సమానత్వాన్ని మానవాళికి ప్రబోధిస్తుంటాయి.

మానస సరోవర దర్శనం...

మాంధాత మహారాజు మానస సరోవరం సరస్సును కనుగొన్నాడని చెప్పబడింది. మానవ సరోవరం ఒడ్డున గల అద్భుతమైన పర్వతాల సమీపంలో మాంధాత ఘోరమైన తపస్సు చేసినందున ఆ పర్వతాలకు మాంధాత నామం సంక్రమించింది. సరోవర మధ్య భాగంలో ఒక వృక్షం ఉందని బౌద్ధ మతస్తులు విశ్వసిస్తుంటారు. ఆ వృక్షానికి కాచే ఫలాలు శారీరక మరియు మానసిక రుగ్మతలను నయం చేస్తాయని వారి నమ్మకం.

కైలాస పర్వత యాత్ర సాహస యాత్రకు ఏ మాత్రం తీసిపోనందున, అవాంఛనీయ సంఘటనలు, అనారోగ్య పరిస్థితులను యాత్రికులు చవి చూడవలసి వస్తుంది.
WD Photo
WD
సముద్రమట్టానికి సగటున 3500 మీటర్ల ఎత్తున ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఎత్తైన ప్రాంతాలలో తగినంత ఆక్సిజన్ లభించదు కనుక తలనొప్పి, శ్వాస తీసుకోలేకపోవడం, అసౌకర్యంగా అనిపించడం తదితర అనారోగ్య లక్షణాలు తలెత్తుతాయి. వీటిన్నిటికి విశ్రాంతికి మించిన ప్రత్యామ్నాయం మరొకటి ఉండదు. కొత్త వాతావరణానికి దేహ తత్వం తనను తాను మలుచుకుంటుందనే అంశాన్ని కొన్ని లక్షణాలు తెలుపుతుంటాయి.
కైలాస పర్వతాన్ని చేరుకునే మార్గం :

1) భారతదేశం నుంచి రోడ్డు ద్వారా : భారత ప్రభుత్వం మానవసరోవర సరస్సుకు యాత్రలు నిర్వహిస్తుంటుంది. ఈ యాత్రలో 28 నుంచి 30 రోజుల పాటు పర్వతాలపై కొనసాగుతుంది. యాత్రకు సంబంధించిన సీట్లు పరిమతమైనందున చాలా రోజుల ముందుగానే సీట్లను రిజర్వ్ చేసుకోవాలి. యాత్రలో పాల్గొనేవారిని డ్రా నిర్వహించడం ద్వారా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంపిక చేస్తుంది.

2) విమానం ద్వారా ఖాట్మండు చేరుకుని అక్కడ నుంచి రోడ్డు ద్వారా కైలాస పర్వత దిగువభాగంలోని మానస సరోవర సరస్సును చేరుకోవచ్చు.

3) హెలికాఫ్టర్ ద్వారా : ఖాట్మండు నుంచి నేపాల్‌గంజ్ మరియు అక్కడి నుంచి సిమికోట్‌కు నిర్దేశిత వింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా ఈ యాత్ర ప్రారంభమవుతుంది. సిమికోట్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా హిల్సా చేరుకోవచ్చు. అక్కడి నుంచి ల్యాండ్ క్రూయిజర్ల ద్వారా మానససరోవరానికి చేరవచ్చు.

4) ల్హాసా గుండా ప్రయాణం : ఖాట్మండుకు చేరుకున్న తరువాత అక్కడి నుంచి చైనా విమానం ద్వారా ల్హాసా చేరుకోవచ్చు. అక్కడి నుంచి టిబెట్‌లోని షిగెట్సె, గ్యాంట్సె, ల్హాట్సె, ప్రయాగ్ తదితరాల నగరాలను దర్శించుకుంటూ మానస సరోవరానికి చేరుకోవచ్చు.


భూమ్మీదే కైలాసం (మౌంట్ కైలాస్)



సృష్టికర్త బ్రహ్మ నివశించేది బ్రహ్మలోకం, విష్ణువు ఆవాసం వైకుంఠం, శివుడు ఉండేది కైలాసం. మరి ఆ కైలాసం ఎక్కడ ఉంది ? భూమ్మీదే కైలాసం ఉందా ? సజీవంగా కైలాసానికి వెళ్లగలమా ? మానవ శరీరంతోనే త్రినేత్రుని దర్శన భాగ్యం కలుగుతుందా ? భూమిపై ఈశ్వరుని ఉనికి నిజమేనా ? లయకారుడి నివాస స్థలాన్ని మనం దర్శించగలమా ?
ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం లభిస్తుంది. బ్రహ్మ లోకానికి, వైకుంఠానికి ప్రాణం ఉండగా వెళ్లడం సాధ్యకాదుకాని..కైలాసానికి మాత్రం మానవశరీరంతోనే వెళ్లిరావచ్చు. శివుని కైలాసం ఉన్నది మరెక్కడో కాదు టిబెట్లో ఉన్న హిమాలయా పర్వతాల్లో మంచు కొండల్లో వెండివెన్నెల, అతీంద్రియ మహాశక్తులు, అంతుపట్టని వెలుగు దివ్వెలు, సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో సైన్స్ కు అందని అసాధారణ వ్యవస్థ. పరమశివుని ఆవాసం, పార్వతినివాసం ఈ భూమ్మీదే ఉంది.


సముద్ర మట్టానికి 21,778 అడుగుల (6,638 మీటర్లు) ఎత్తులో టిబెట్ భూభాగంలో ఉన్న హిమాలయా పర్వత శ్రేణుల్లో ఈ కైలాస పర్వతం (మౌంట్ కైలాస్) ఉంది. ఈ పర్వతంపైనే శివపార్వతులు కొలువై ఉన్నారు. ఆసియాలో పొడవైన నదులుగా పేరుగాంచిన బ్రహ్మపుత్ర, సింధూ, సట్లజ్, కర్నాలి (గంగానదికి ఉపనది)మూలాలు ఈ పర్వత ప్రాంతంలోనే ఉన్నాయి. హిందువులు, బౌద్ధులు, జైనులు, బాన్ మతస్థులు ఈ పర్వతాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. మౌంట్ కైలాస్ మామూలు పర్వతం కాదు. హిమాలయాల్లో ఏ పర్వతానికి లేని విశిష్టతలు ఇక్కడ చాలా కనిపిస్తాయి. మానస మేథస్సుకు అర్థంకాని రహస్యాలు ఎన్నో ఇక్కడ దాగి ఉన్నాయి. కైలాస పర్వతం నలువైపులా నాలుగు రూపాల్లో ఉంటుంది. నాలుగు రంగుల్లో ఇది దర్శనమిస్తుంది. కైలాస పర్వతానికి వెళ్లే ప్రతిభక్తునికి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఏదో ఒక రూపంలో ఉమాశంకరుల దర్శనం కలుగుతుంది.


హిందూ మత విశ్వాసాల ప్రకారం లయకారుడు శివుడు ఈ కైలాస పర్వత శిఖర భాగాన నివశిస్తాడు. పార్వతీ సమేతుడై నిరంతర ధ్యాన స్థితిలో ఉంటాడు. విష్ణు పురాణం ప్రకారం కైలాస పర్వతం ప్రపంచానికి పునాది వంటిది. తామర పువ్వు ఆకారంలో గల ఆరు పర్వత ప్రాంతాల మధ్యలో ఈ పర్వతం ఉంటుంది. కైలాసం నుంచి మొదలయ్యే నాలుగు నదులు ప్రపంచపు నాలుగు భాగాలకి ప్రవహించి ప్రపంచాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తున్నాయి. కైలాస పర్వత నాలుగు ముఖాలు స్పటిక, బంగారం, రుబి, నీలం రాయులతో రూపొందినట్లు విష్ణు పురాణం చెబుతుంది. అందుకే ఇది నలువైపులా నాలుగు వర్ణాల్లో గోచరిస్తుంది. అంతేకాదు కైలాస పర్వతానికి నాలుగు రూపాలు ఉన్నాయి. ఒకవైపు సింహంగా, ఇంకోవైపు గుర్రంగా, మూడోవైపు ఏనుగుగా, నాలుగోవైపు నెమలిగా కనిపిస్తుంది. ఇందులో గుర్రం హయగ్రీవ రూపంకాగా, సింహం పార్వతి దేవి వాహనం, ఏనుగు విఘ్నేశ్వరుని ప్రతీక అయితే నెమలి కుమార స్వామి వాహనం.ఇవన్నీ ఈశ్వర స్వరూపానికి ప్రతీకలుగా పురాణాలు చెబుతాయి.


మంచుపూర్తిగా కప్పుకున్నప్పుడు పౌర్ణమి రాత్రి వెండికొండలా మిలమిల మెరిసే కైలాస దర్శనం అత్యద్భుతం, అమోఘం. కైలాస పర్వతాన్ని అపశవ్య దిశతో చుడతారు. దీని చుట్టుకొలత 52 కిలోమీటర్లు. కొంత మంది యాత్రికులు కైలాస పర్వతాన్ని ఒక్కరోజులోనే చుట్టిరావాలని నమ్ముతారు. కానీ ఇది అంత సులభం కాదు. మంచి ఆరోగ్యవంతుడై వేగంగా నడిచే వ్యక్తి ఈ 52 కిలోమీటర్ల దూరం చుట్టిరావడానికి 15 గంటల సమయం పడుతుంది. సాధారణ యాత్రికులకు మూడురోజుల సమయం పడుతుంది.
కైలాసాన్ని ఎవరూ అధిరోహించలేదా :



ప్రపంచంలో ఎవరూ అధిరోహించని పర్వతాల్లో కైలాస పర్వతం కూడా ఒకటి. దీన్ని అధిరోహించడం ఇప్పటికీ ఎవరి వల్ల సాధ్యంకాలేదు. దీన్ని ఎవరూ ముట్టుకునేందుకు కూడా సాహసించలేదు. కొంతమంది సాధువులు సాహసించినా వారు కొంత దూరంలోనే అదృశ్యమయ్యారని చెబుతారు. ఈ పర్వతాన్ని పూజించే అన్ని మతాల ప్రకారం దీని వాలులలో కాలుపెట్టడం మహాపాపం. ఈ మూఢ నమ్మకాన్ని తొలగించడానికి ప్రయత్నించి వారంతా ఆ ప్రయత్నంలోనే మరణించాలని చెబుతారు. 1950లో చైనిస్ సైన్యం టిబెట్ లో అడుగు పెట్టిన తరువాత, చైనిస్-ఇండియన్ సరిహద్దులలో నెలకొన్న రాజకీయ, సరిహద్దు అనిశ్చితి వలన శివ భగవానుడి నివాసానికి చేసే తీర్థయాత్ర 1954 నుండి 1978 వరకు నిలిపివేయబడింది. దానితరువాత పరిమిత సంఖ్యలో భారతీయ తీర్థయాత్రికులు ఈ ప్రదేశాన్ని దర్శించడానికి అనుమతి లభించింది. చైనా దీనిపై ప్రయోగాలు చేసి విఫలమైంది. రెండుసార్లు ఈ పర్వతం పైకి హెలికాఫ్టర్ పంపిస్తే అవి మధ్యలోనే కూలిపోయాయి. అప్పటి నుంచి చైనా ఆర్మీ మౌంట్ కైలాస్ జోలికి వెళ్లే సాహనం చేయడం లేదు.ఆరు పర్వత ప్రాంతాల మధ్య ఉండటంతో ఇప్పటివరకు అవుటర్ సర్కిల్ లో తిరిగిన వారు తప్ప ఇన్నర్ సర్కిల్ లోకి వెళ్లిన వారు లేరు. ఈ పర్వత ఉపరి భాగంలో  ఏముందో సైన్స్ కు కూడా అంతుబట్టలేదు. యోగ శాస్త్రంలో మౌంట్ కైలాస్ ను షహస్ర చక్రంగా పేర్కొన్నారు.
కైలాస పర్వత యాత్ర :


భారత ప్రభుత్వం జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో మానససరోవర, కైలాస పర్వత యాత్ర నిర్వహిస్తుంది. టిబెట్, ఖాట్మాండుకు చెందిన కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు కూడా ఈ యాత్రను నిర్వహిస్తున్నాయి. ఫిట్ నెస్ కి సంబంధించి వైద్య పరీక్షల్లో పాస్ అయితేనే ఈ యాత్రకు అనుమతినిస్తారు.
మానస సరోవరం :


కైలాస పర్వత పాదపీఠంలో మానస సరోవరం మరో అపురూపం. స్వచ్ఛతకు ఈ సరస్సు నిలువుటద్దం. మానససరోవరం నుంచి కైలాస పర్వతాన్ని చూడవచ్చు. మానస్ అంటే మైండ్, బ్రహ్మ తన మైండ్ నుంచి ఈ సరస్సును సృష్టించాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఉదయం 3 నుంచి 5 గంటల మధ్యలో బ్రహ్మీ ముహుర్తంలో ఈశ్వరుడు ఈ సరస్సులో స్నానం చేస్తాడని భక్తుల విశ్వాసం. కైలాసం మీదుగా సరస్సులోకి ఒక జ్యోతి ప్రవేశించటం ఇక్కడికి వచ్చిన చాలా మందికి అనుభవమే. ఈ సరస్సు చుట్టుపక్కల ఉండే గృహల్లో మునులు వేలాది సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నారని భక్తుల విశ్వాసం. మానస సరోవర ప్రాంతంలో ఎన్నో ఔషధ విలువలు ఉన్న మొక్కలు మనకు కనిపిస్తాయి.


ఈ ప్రపంచానికి కైలాసం తండ్రిగా, మానస సరోవరం తల్లిగా ఉందని హిందువుల విశ్వాసం. పట్టాభిషేకం తర్వాత రామ,లక్ష్మణులు, చివరి దశలో పాండవులు, వశిష్ఠుడు, అరుంధతి, ఆది శంకరాచార్యుడు  కైలాస పర్వత యాత్ర చేసారని హిందూ మత గ్రంథాలు చెబుతున్నాయి.బుద్ధుని తల్లి మాయాదేవి కూడా మానస సరోవరంలోనే స్నానమాచరించి మంచి తనయుడు పుట్టాలని ప్రార్థించినట్లు బౌద్ధమత గ్రంథాలు పేర్కొన్నాయి. మానససరోవరంలో స్నానం చేసి కైలాస పర్వతాన్ని దర్శించుకుంటే పునర్ జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. కైలాస దర్శనం భక్తులకు ఒక పవిత్ర అనుభూతి, మాటల్లో వర్ణించలేని భావమది. పదాలకు అందని పవిత్రత అది.


Tuesday, July 31, 2012

AGHORA SAADHU

AGHORA SAADHU



Aghori’s Lifestyle

Aghori
After seeing Bala’s Naan Kadavul, I was quite interested in knowing the lifestyle of Aghori’s. Below are the detailed history and stories of Aghori’s.

Undisputed Religion’
It’s not uncommon for humans to eat flesh. Since times immemorial, history has redeemed that in order to survive, homo sapiens have retorted to different means of dietary functions.
Some have restricted themselves to being vegetarians. Other non-vegetarians, as if to strike a balance between the two, believe in practicing a subtle form of cannibalism — all in the name for inner peace and tranquility.
Its hard to believe, but the fact remains that despite improvements in the Hindu society’s horrid caste system, that believed in racially bifurcating people depending on which caste they belonged to, there still exists sections of educated, or shall we say emancipated men and women who allow the Aghoris to practice the grotesque act of devouring a piece of dead rotten flesh. Especially if the corpse has just been reduced to ashes.

The Aghori
The Aghori ascetic considers himself to be a symbol of the Lord Shiva (the last from the trinity of Brahma and Vishnu according to Hindu Mythology). He goes naked or is dressed in the shroud of a corpse, covers himself in the ashes of the cremation ground, (a polluting for an orthodox Brahmin, and his, and sometimes macabre, ritual actions are symbols of his non-dualistic beliefs. The corpse upon which he meditates is a symbol of his own body and the corpse devouring ritual is a symbol of the transcendence of his lower self and a realization of the greater, all pervading self.

Their Doctrine
Because of this monistic doctrine, Aghoris strongly believe that there are no opposites in this world and that the conventional Hindu distinctions between purity and impurity are actually an illusion of some sort. They live on cremation grounds, smearing themselves with the ashes of corpses and eating from a cranial begging bowl. They are attributed with eating corpse flesh, which may be a once in a lifetime ritual act, and meditating seated upon a corpse and thereby gaining control over the corpse’s spirit. They have also been accused of practicing human sacrifice. The Aghoris claim to perform a secret Tantric ritual involving sex with a lower caste, menstruating woman during, which the Aghori becomes Shiva and his partner Shiva’s female energy or “Shakti”. The purpose of embracing pollution in these practices is realization of non-duality through transcending social taboos and seeing the illusory nature of all conventional categories.
Most people who ‘understand and accept’ this religious act of subdued cannibalism believe that Aghoris can be accepted in society. As living in a democracy, it’s not uncommon to observe such eerie acts of religion. Since practicing this needs loads of perseverance, Aghoris are very small in number.
These devout followers of Lord Shiva, (the last from the divine trinity of Brahma, Vishnu and Shiva), are convinced that this is not a cannibalistic act. Since the dead and often rotten flesh is not eaten raw, rather thawed in liquor, untouched by the human hand, and consumed by a certain self professed ‘chosen’ number of people. These people look for small pieces of flesh at the Hindu cremation grounds and are identified by their shiny attire. Since, of course, the idea of eating dead flesh is quite repulsive, this rite is not practiced often, only once or twice in a span of four to five years. Moreover, they believe that this act gives one an absolute feeling of catharsis, destroying every shred of hatred and bringing with it immense divine foresight. Some food for thought!!!!

Friday, May 18, 2012

DO YOU BELEAVE ME?

About Me DO YOU BELIVE ME? - - - - - - - - - -

THERE ARE SOMETHINGS ABOUT LIFE I WANT TELL YOU - - - - - - - -

1.Be strong enough to face the world each day.

2.Be weak enough to know you cannot do everthing do everthing alone.

3.Be generous to those who need your help.

4.Be frugal with what you need you self.

5.Be wise enough to know that you do not know everything.

6.Be foolish enough to belive in miracles.

7.Be willing to share of joys.

8.Be willing to share the sorrows of others.

9.Be a leader when you see a path of others have missed.

10.Be a follower when you are shrouded in the midst of uncertainly.

11.Be the firss to congratulate an oppent who succeeds.

12.Be the last to criticize a colleaque who fails.

13.Be sure where you are next step will fall,so that you will not stumble.

14.Be sure of your final destination,in case you are going to the wring way.

15.Be loving to those who love you.

16.Be loving to those who do n

Saturday, February 4, 2012

Life..

Sometimes people come into your life and you know right away that they were meant to be there, to serve some sort of purpose, teach you a lesson, or to help you figure out who you are or who you want to become.
You never know who these people may be (possibly your roommate, neighbor, professor, long lost friend, lover, or even a complete stranger), but when you lock eyes with them, you know at that very moment they will affect your life in some profound way.

And sometimes things happen to you that may seem horrible, painful, and unfair at first, but on reflection you find that without overcoming those obstacles you would have never realized your potential, strength, will power, or heart.

Everything happens for a reason. Nothing happens by chance or by means of good luck. Illness,injury, love, lost moments of true greatness, and sheer stupidity all occur to test the limits of your soul. Without these small tests, whatever they may be, life would be like a smoothly paved,
straight, flat road to nowhere. It would be safe and comfortable; but dull and utterly pointless.

The people you meet who affect your life, and the success and downfalls you experience, help to create who you are and who you become. Even the bad experiences can be learned from. In fact, they are probably the most poignant and important lessons we may learn.

If someone hurts you, betrays you, or breaks your heart forgive them, for they have helped you learn about trust and the importance of being cautious when you open your heart. If someone loves you, love them back unconditionally, not only because they love you, but because in a way, they are teaching you to love and how to open your heart and eyes to things.

Make every day count. Appreciate every moment and take from those moments everything
that you possibly can for you may never be able to experience it again. Talk to people that you have never talked to before, and actually listen.

Let yourself fall in love, break free, and set your sights high. Never be miserly with love, give, give and give is the motto of Love. And strangely, when you simply give for the pleasure of giving it brings a sweet peace all its own.
Hold your head up because you have every right to. Tell yourself you are a great person and believe in yourself, for if you don't believe in yourself it will be hard for others to believe in you. You can make of your life anything you wish. God created you for success. If you believe
you are a pathetic loser, you will be a very pathetic loser!

Create your own life and then go out and live it with absolutely no regrets. Most importantly,
if you love someone tell them! For you never know what tomorrow may have in store. And learn a lesson in life each day you live. Today is the tomorrow you were worried about yesterday. Was it worth it?

Evolution did not enhance the distance between us, and the pure forms of emotion. Our misconceptions do. To love, romantically or otherwise, all you need to do is to give. Love
is all about giving; taking comes into the picture only when there is a transaction, when you give in exchange for something you need. As for true love, it wells up from within us, like a spring from the mountainside. You don't give it to another in exchange for what you need (to be loved?), for
all you can do with Love is to give it. The mountain-spring doesn't first check out if there is a proper channel for it to reach the sea, it simply wells out of the side of the mountain because that is its nature. It finds its' way to the sea for that is the nature of necessity.

Life is full of beauty and misery; it is your choice how you want to see it. So when you come down to it, it is YOU who decides what it is. Being able to be alone and silent you need to have a great richness within you. But if you need people, music TV and yes, even the `Net around all the time, to keep you from thinking, experiencing and living then I guess there isn't much, or isn't much that you think is good there. noise and people are an escape from recognizing the emptiness within.

Solitude is a choice we make. The world is full of people, very good people mostly. The bitterness of the lonely comes from within when they mis-perceive the beauty of people and the world. Look for good and u will find good. Unfortunately, the converse is also true.

Life is not a dilemma. Life is to live, to love, to laugh before we go on to a better place. We make our heaven and hell here when we refuse to recognize and accept God's gifts. So open your eyes and heart and live a happy life in the heaven you create for yourself on earth.

I do get so upset when I hear kids say, write, or think sad things about life. Life should be an interesting adventure, both the good and the bad. The `bad' only teaches us how to be better and so have a better life.

You ask about Fate. Well we are all born with our individual genes in a particular environment. Then we arrive at certain cross roads in life and we choose our fate from the road we take at this cross road. Each one of us is given choices. Some choices are already more or less set by our having become a particular type of person from our previous choices. One is bound to make decisions, choices and that is what we call fate. We can also learn from the wrong turns we take at life's cross roads. So that when we are faced with similar choices we can make wiser choices. Thats what is called free will.

The unknown is not really unknown, not if you believe and have faith in God's good intentions. I KNOW that whatever happens in my life is for my good because God loves me. If sometimes I cry and moan it is only coz I forget this at those times. But if I look back on my life I see that every rough period in my life was always what took me to a better end; either by making me a better person or by teaching me and so helping me make wiser choices in my life.

No, we do not have the key to our future coz then there would have been no excitement in life. Do you enjoy a thriller movie if you know the story?

- An Article by Zeenath Jahan

Friday, August 6, 2010

FINALLY NAMES FOUND

FIRST BOY NAME

DEEVESH PAWAN

SECOND BOY NAME

DEEMBU JAGANNATH